5 May, 2026 | 7:07 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

కారు పల్టీ కొట్టి ఒకరు మృతి, మరొకరికి గాయాలు

06-03-2026 10:23 AM

మోతె,(విజయక్రాంతి): కారు పల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాల పాలైన ఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బురకచర్ల గ్రామానికి చెందిన కోట మహేందర్ రెడ్డి (66), చిరుముల సత్తి రెడ్డి అను వ్యక్తులు వారి యొక్క సొంత కారులో నకిరకేల్  పెళ్లికి వెళ్లి హాజరై ఇంటికి వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30 లకు మోతే గ్రామ శివారులో సర్విస్ రోడ్డు కు చేరుకునే సరికి వారి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టిందన్నారు.

దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి అన్నారు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా  కోట మహేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. చిరుముల సత్తిరెడ్డి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు.