calender_icon.png 13 August, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క హగ్ జీవితాన్ని మార్చేస్తుంది

10-08-2025 12:19:45 AM

చాలా మంది సంతోషమైనా, బాధేసినా కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచి అలవాటు. దీని వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణుల అభిప్రాయం. 

అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెసేజ్‌లు చేసుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడం అన్నీ ఆన్‌లైన్‌లో నే జరిగిపోతున్నాయి. వేల మాటల కన్నా ఒక్క కౌగిలింత ఎంతో మంచిది. ఫిజికల్ టచ్‌తో వ్యక్తిలోని ఆనందాన్ని రెట్టింపు చేయవచ్చు. అందుకే ఒక్క హగ్.. జీవితాన్ని మార్చేస్తుందంటారు పెద్దలు. ఇంకా ఆలస్యమెందుకు.. మీరు ఒక హగ్ ట్రై చేయండి..

కౌగిలింత (హగ్గింగ్) అనేది ప్రేమ, ఓదార్పును వ్యక్తపరచడానికి శక్తివంతమైన మార్గం. ప్రియమైన వ్యక్తి నుంచి వెచ్చని ఆలింగనం అయినా, స్నేహితుడి నుంచి భరోసా ఇచ్చే కౌగిలింత అయినా, లేదా కష్ట సమయాల్లో ఓదార్పునిచ్చే ఆలింగనం అయినా చాలా గొప్పది. కౌగిలింతలు మానవ సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. సైన్స్ ప్రకారం చూసుకుంటే కౌగిలింత అనేది మన మానసిక స్థితి, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. 

చాలా మంది సంతోషమైనా, బాధేసినా కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచి అలవాటు. దీని వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెసేజ్‌లు పంపడం, విషెస్ తెలపడం, ఒకరినొకరు పలకరించుకోవడం అనన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి.

అయితే వేల మాటల కన్నా ఒక్క కౌగిలింత ఎంతో మంచిది. ఫిజికల్ టచ్‌తో వ్యక్తిలోని ఆనందాన్ని రెట్టింపు చేయవచ్చు. బాధను తగ్గించవచ్చు. మనం ఒకరిని కౌగిలించుకున్నప్పుడు, మన శరీరాలు ఆక్సిటోసిన్ను విడుదల చేస్తాయి.సంప్రదాయ వైద్యంలోనూ కౌగిలింత ఒక మెడిసిన్‌లా పనికొస్తుంది. కొన్ని రకాల చికిత్సలకు మందులకు బదులు ఒక్క కౌగిలింత ఇచ్చే ధైర్యం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

హగ్గింగ్ థెరపీ..

హగ్గింగ్ థెరపీ అనేది వ్యక్తుల ఒంటరితనం, ఆందోళన, ఇతర భావోద్వేగ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ప్లాటోనిక్ స్పర్శ చికిత్సా విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ చికిత్స ద్వారా చాలా లాభాలున్నాయి. 

* ఒంటరితనం నుంచి దూరం చేస్తుంది

* ఆందోళన, నిరాశను తగ్గించే ప్రయత్నం

* ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తోంది

* నిద్రలో నాణ్యతను మెరుగుపరుస్తుంది

* భద్రతా భావాన్ని పెంచడంలో సహాయపడుతుంది

కౌగిలింతల ‘అమ్మ’

మన దగ్గర ఒక కౌగిలింతల అమ్మ ఉంది. ఆమె మాతా అమృతానందమయి. ఆధ్మాత్మిక గురువు, మానవతావాది అయిన ఆమెను అందరు ‘అమ్మ’, ‘అమ్మాచి’ అని పిలుస్తారు. ‘హగ్గింగ్ సెయింట్‌గా’ అమ్మ అందరికి సుపరిచితం. కేరళకు చెందిన మాతా అమృతానందమయి 1953 సెప్టెంబర్ 27న జన్మించారు.

ప్రేమమూర్తిగా, సద్గురువుగా, సంఘసేవికగా, విద్యాదాతగా ప్రఖ్యాతి గాంచారు. 1978 నుంచే అమ్మ దర్శనం కోసం దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు రావటం ఆరంభమైంది. మానవతా కార్యక్రమాలు, బోధనలు, భక్తులను ప్రేమతో ఆలింగనం చేసుకోవడం ద్వారా అమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. 

కౌగిలింతల్లో రకాలు..

ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక నుండి హత్తుకున్నారంటే మీ రక్షణ గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం.. సహజంగా ప్రేమికులు లేదా భార్యాభర్తల్లో ఇలాంటి కౌగిలింతలు ఎక్కువగా కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతున్నా ఓ వ్యక్తి మిమ్మల్ని వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నారంటే వారు దేని గురించో మీకు చెప్పాడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అలాంటప్పుడు వారికి ఏం జరిగింతో ఎలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి.

బిగి కౌగిలింతలు గురించి మాట్లాడుకుంటే.. మనకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో లేక వారిని విడిచి వెళ్లడానికి ఇష్టపడనప్పుడో గట్టిగా కౌగిలించుకుంటారు. దీనినే బేర్ హగ్ (బిగి కౌగిలింత) అని పిలుస్తుంటారు.

ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలా గట్టిగా హగ్ చేసుకుంటే వారికి మీపై ఎంతో ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ప్రేమికులు, భార్య భర్తలు, తల్లీ పిల్లల మధ్య కాకుండా.. స్నేహితులు, బంధువులు మధ్య కూడా ఉంటుంది.

ఇక మన ముఖంపై సంతోషం, చిరునవ్వు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని పొలైట్ హగ్ అని పిలుస్తారు. ఇలాంటి కౌగిలింతలు సాధారణంగా స్నేహితులు, పేరెంట్స్-పిల్లలకు మధ్య కనిపిస్తుంటాయని అంటున్నారు. ఇలా ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకుంటే ‘నీకు నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు’ అర్థం.

మనం కౌగిలించుకున్న తర్వాత వీపుపై నిమరడం చూస్తుంటాం. ఇలా హగ్ చేసుకుంటున్నారంటే వారు మీ సంరక్షకులని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సహజంగా తల్లిదండ్రులు లేదా పెద్ద వాళ్ళు పిల్లలను ప్రోత్సహిస్తున్న సమయంలో, వారిని ఓదార్చుతున్న సమయంలో ఇలాంటి కౌగిలింతలు సర్వసాధారణం.

నడుముపై చేతులు వేసి హగ్ చేసుకుంటున్నారంటే వారు.. ప్రేమించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నరిన రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారని అభిప్రాయపడుతున్నారు. 

శరీరాలు తాకాకుండా కేవలం బుజాలపై తల వాల్చి, ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేస్తూ ఆలింగనం చేసుకోవడాన్ని లండన్ బ్రిడ్జ్ హగ్ అని పిలుస్తుంటారు. ఇలా కౌగిలించుకునే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరే బంధం ఉండదని చెబుతున్నారు. ఇది కొంత మందికి అలవాటుడా కూడా ఉంటుంది. బయటికి వెళ్లినప్పుడు అయిన, వచ్చినకా అయిన ఇంట్లో వారికి హగ్ చేసుకుంటు ఉంటారు. దీని లండన్ బ్రిడ్జి హగ్ అని అంటారు.

ఒక వ్యక్తి మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ హత్తుకున్నారంటే వారికి మీపై అంతులేని ప్రేమ, గౌరవం ఉందని అర్థం. మీతో పీకల్లోతు ప్రేమలో ఉంటేనే ఇలాంటి హగ్ ఇస్తారు. శరీరాలు పెనవేసుకుంటూ, కళ్లతో మాట్లాడుకుంటూ ఇచ్చుకునే ఈ హగ్.. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుందని నిపుణులు వివరిస్తున్నారు.