calender_icon.png 25 December, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకేపీ నాలెడ్జ్ పార్క్ సీఈవోగా సత్యప్రకాష్ దాస్

25-12-2025 02:20:44 AM

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (ఐకేపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా డాక్టర్ సత్య ప్రకా ష్ దాస్ నియమితులైనట్లు ఒక ప్రకటనను విడుదల చేశారు. సైన్స్, ఇన్నోవేషన్, ప ర్యావరణ వ్యవస్థలో ఈయన 28 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఐకేపీలో చేరడానికి ముందు ఆయన దేశంలోని ప్రముఖ ఇన్ విట్రో డ యాగ్నస్టిక్స్ కంపెనీలలో ఒకటైన మోల్బి యో డయాగ్నస్టిక్స్‌లో ఆర్‌అండ్‌లోని పై స్థాయిలో పనిచేశారు.

ఈ సందర్భంగా డా.సత్య ప్రకాష్ మాట్లాడుతూ... పరిశోధన, ఆవిష్కరణతోపాటు ఇంక్యుబేషన్ రంగంలో 26 ఏళ్ల అనుభవం కలిగిన ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌కు నాయకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభు త్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, బయోటెక్ స్టార్టప్‌లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.