సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తాడ్వాయి, మార్చి, 24 (విజయక్రాంతి ): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ అధికారి నరేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సైబర్ భద్రతపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఆటో డ్రైవర్లకు మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఓటిపి మోసాలు, ఏపీకే యాప్ ల ద్వారా జరిగే మోసాలు, ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్, డిజిటల్ పేమెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిపట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదన్నారు. ఎవరైనా ఓటీపీలు అడిగినప్పుడు గానీ, బ్యాంకు సమాచారం కానీ ఇవ్వవద్దని ఆయన సూచించారు.
అనుమానస్పద లింకులు గానీ,ఏమైనా యాప్ లను డౌన్ లోడ్ చేయకూడదని సూచించారు. ఒకవేళ సైబర్ మోసం జరిగిందని గుర్తిస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ కు,లేదా సమీప్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, తాడ్వాయి ఎస్త్స్ర నరేష్, పోలీస్ లు, తదితరులు పాల్గొన్నారు.




