ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పాపన్నపేట, మార్చి24: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పొడ్చన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో ఆయా గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, పాపన్నపేట, కుర్తివాడ గ్రామాల సర్పంచులు పావని నరేందర్ గౌడ్, శ్రీధర్, నాయకులు ఆకుల శ్రీనివాస్, శ్రీకాంతప్ప, ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




