25 March, 2026 | 2:10 AM

విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధం

25-03-2026 12:00 AM

శ్రీ సీతారాముని కళ్యాణంకు ముస్తాబైన ఆలయం

జిన్నారం/అమీన్ పూర్, మార్చి 24: గడ్డపోతారంలోని మాదారంలో 42 అడుగుల పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు, శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్రుని కళ్యాణ మహోత్సవానికి ఆలయం ముస్తాబైం ది. ఈనెల 25 నుండి 27 వరకు భారీ పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు, శ్రీ సీతా సమేత రామచంద్రుని స్వామివారి క ళ్యాణం కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం గ్రామ పెద్దలు, భక్తజను ల సమక్షంలో ఘనంగా కనుల పండువగా నిర్వహించడానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.

మాదారంలో కొలువుదీరిన శ్రీ శ్రీ సీతా సమేత రామచంద్రుని ప్రాంగణం పం చముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ మాట్లాడుతూ 42 అడుగుల పంచముఖి హను మాన్ విగ్రహ ప్రతిష్ట, సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణం ఒకేసారి జరు పుకోవడం సంతోషంగా ఉందన్నారు. పంచముఖి హనుమాన్ కమిటీ సభ్యులు మా ట్లాడుతూ హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపనకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించామన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. మూడు రోజుల కార్యక్రమాలను ప్ర తి ఒక్కరు సహకరించి, విజయవంతం చేయాలని వారు కోరారు.