30 April, 2026 | 4:51 AM

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

30-04-2026 02:40 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని  జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగం గా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన స్పోరట్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి డీసీపీఓ మహేష్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆన్లైన్ గేమ్స్, ఫేక్ లింక్స్, ఫిషింగ్ కాల్స్ వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.