30 April, 2026 | 4:11 AM

జైపూర్ ఎస్‌ఐగా భూమేష్ బాధ్యతల స్వీకరణ

30-04-2026 02:41 AM

జైపూర్ (చెన్నూర్), ఏప్రిల్ 29: జైపూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా భూమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. జైపూర్ పోలీసులు 24 గంటలు మండల ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, గంజాయి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళలు, బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా స్టేషన్‌కు రావాలని కోరారు.