1 July, 2026 | 12:55 AM

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

01-07-2026 12:00 AM

తొమ్మిది రోజులు నిరంతరంగా రైతు భరోసా: మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అధికారులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం సర్పంచ్ గోపగాని తిరుపతి గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. కేవలం ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 61 వేల మంది ఉన్నారన్నారు. భీమదేవరపల్లి మండలంలోని రాష్ట్రంలో అత్యధికంగా 11 వేల మంది తటస్థంగా ఉన్నారన్నారు.  సమావేశంలో నాయకులు అశోక్ ముఖ ర్జీ, కె. లక్ష్మారెడ్డి, సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కె. చంద్రశేఖర్ గుప్తా, పి. రాజిరెడ్డి, చిదురాల స్వరూప, ఊస కోయిల ప్రకాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి.స్రవంతి, బావు పేట యాదగిరి, గుడికందుల రాజు పాల్గొన్నారు.