1 July, 2026 | 1:02 AM

బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

01-07-2026 12:00 AM

సూర్యాపేట, జూన్ 30 (విజయక్రాంతి)  : జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో గల తిమ్మాపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ యువకులు ఆ పార్టీని వీడి బిఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో  గరిగంటి శ్రీకాంత్, నాగెల్లి సంపత్ లతో పాటు పలువురు యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పాల సొసైటీ మాజీ చైర్మన్ చల్లా వేణుదర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు ఇందిరా సోమరాజు, ఉపసర్పంచ్ దేశిడి సందీప్ రెడ్డి, వార్డు మెంబర్లు ఆదె శోభారాణి మధు, బొల్లం ప్రభాకర్, ఉప్పు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.