18 August, 2026 | 8:13 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌

18-08-2026 07:41 PM

విద్యుత్‌ నుంచి తాగునీటి వరకు సమస్యలపై సమీక్ష

వెంటనే పరిష్కరించాలని ఆదేశం

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి, నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ ఉమా హారతి అధ్యక్షతన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులు, సర్పంచులను అడిగి విద్యుత్‌, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలను తెలుసుకున్నారు.

గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలని సూచించారు.

గ్రామాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.సమావేశంలో  ఎమ్మార్వో సంగ్రామ్‌రెడ్డి, ఎంపీడీవో మహేశ్వరరావు, ఏవో ప్రవీణ్‌చారి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రశాంతి,  బంజారా సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు అశోక్ చౌహాన్, మండల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.