27 July, 2026 | 2:31 AM

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

27-07-2026 01:55 AM

పార్టీ కార్యకర్తలకు పిలుపు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ 

కామారెడ్డి, జూలై 26 (విజయక్రాంతి): సర్ ఫై పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చేనెల 10 తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి మండల, మున్సిపాలిటీ కార్యకర్తల నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అప్రమత్తంగా ఉంటూ అసలైన ఓటర్ల ఓటు హక్కును కాపాడాలని సూచించారు. బిఎల్‌ఓ లు ఇచ్చిన దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి అందజేసే విధంగా చూడాలన్నారు.

మూడో తేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను బిఎల్‌ఓ కు అందజేయాలన్నారు. 10వ తేదీన లిస్టును పెట్టడం జరుగుతుందన్నారు. లిస్టును చెక్ చేసి అర్హులైన వారి పేర్లు ఉన్నాయా లేవా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్,హపిజ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, పార్టీ నాయకులు కాసర్ల స్వామి, జూకంటి ప్రభాకర్ రెడ్డి, బల్వంత్ రావు, జెర్సీ నర్సింలు, హనుమాన్లు, కృష్ణాజి రావు, శశికాంత్ రావు, పుల్లూరు సతీష్, తదితరులు పాల్గొన్నారు