ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట్, జూలై 10 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం మీర్‌పేట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సుకు ఆమె మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఇమిగ్రేషన్ ఫారాలు, ఓటరు జాబితా నమోదు విధా నం, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్య లు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా ప్రతి దశ ను జాగ్రత్తగా పరిశీలిస్తూ బాధ్యతాయుతం గా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఐచ్చితం శ్రీధర్, బిఆర్‌ఎస్ యూత్ నాయకులు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి, మాజీ ఏంపిపి, సీనియర్ నాయకులు జిల్లేల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ప్రధా న కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, అర్కల భూపాల్‌రెడ్డి, నాగేష్, కామేష్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






