పార్లమెంట్ ముందుకు 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లులు
14-12-2024 11:31 AM
న్యూఢిల్లీ: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లులను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టనుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. గురువారం జరిగిన భేటీలో బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 16న రెండు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరో బిల్లు ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్రం రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో పార్లమెంట్ ముందుకు తీసుకొస్తుంది. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలు చేయాలని రామ్ నాథ్ కోవింద్ కమిటీ కేంద్రానికి సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర తీసుకొచ్చింది.






