calender_icon.png 18 August, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు!

16-08-2025 12:17:15 AM

పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ కాలం యువతను ఆకట్టుకునేలా మేకర్స్ ఈసారి ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ టైటిల్‌తో వస్తున్నారు. ఈ విభిన్నమైన చిత్రం మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. తోట రామకృష్ణ దర్శక నిర్మాతగా వ్యవహ రిస్తున్నారు. సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా రాశీసింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రఘుబాబు, కశిరెడ్డి రాజ్‌కుమార్, వీరశంకర్, గౌతమ్ రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇదొక కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇటీవలే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: మోహిత్ రహమానియాక్; సాహిత్యం: చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల; సినిమాటోగ్రఫీ: శ్రీనివాసరాజు; ఎడిటర్: గన్.