15-08-2025 12:14:32 AM
ఎలాంటి గ్లామర్ షో లేకుండా వరుస సినిమాలతో అలరించిన అందాల రాక్షసి సాయి పల్లవి. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చివరగా నాగచైతన్య సరసన ‘తండేల్’ చిత్రం లో కనిపించి, భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిందీలో అవకాశా లు అందుకుంటూ అక్కడే బిజీగా అయ్యింది. ఆమె చేతిలో ఉన్న వాటిల్లో ముఖ్యంగా బాలీవుడ్ ‘రామాయణ’. ఇందులో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా..
సీత పాత్రను సాయిపల్లవి పోషిస్తోం ది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్ హీరో, డైరెక్టర్‌తో మూడోసారి కలిసి పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ‘కుబేర’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు శేఖర్ కమ్ముల. హీరో నాని ఓవైపు ‘హాయ్ నాన్న’ లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్3’ లాంటి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. అయితే నాని, శేఖర్ కమ్ముల కలయికలో తొలిసారి ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాలోనే నానికి జంటగా సాయిపల్లవి నటిస్తోంది. సాయిపల్లవి.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఇంతకుముందు ‘ఫిదా’, ‘లవ్‌స్టోరీ’ సినిమాల్లో మెప్పించింది. అలాగే నానితోనూ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో కనువిందు చేసింది. ఇలా అటు హీరో, ఇటు దర్శకుడు..
ఇద్దరితోనూ రెండు సినిమాలు చేసిన సాయిపల్లవి.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. అంటే, హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ములతో సాయిపల్లవిగా ముచ్చటగా మూడో సినిమా చేస్తోందన్నమాట. మాస్ హీరో, క్లాస్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండనుందనే విషయమై సినీప్రియుల్లో ఇప్పట్నుంచే ఆసక్తి నెలకొంది.