16-08-2025 12:18:54 AM
భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామ సత్య నారాయణ ఇప్పుడు ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో ఈ సినిమాల ప్రారంభ పూజ శుక్రవారం జరిగింది. సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం జరుపుకున్న సినిమాలు, దర్శకుల వివరాలు చూస్తే.. జస్టిస్ ధర్మ (దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్), నాగపంచమి (డైరెక్టర్: ఓం సాయిప్రకాశ్), నా పేరు పవన్‌కల్యాణ్ (జేకే భారవి), టాపర్ (ఉదయ్ భాస్కర్), కేపీహెచ్‌బీ కాలనీ (తల్లాడ సాయికృష్ణ), పోలీస్ సింహం (సంగకుమార్), అవంతిక-2 (శ్రీరాజ్ బళ్లా), యండమూరి కథలు (రవి బసర), బీసీ కమాండో (మోహన్ కాంత్), హనీ కిడ్స్ (హర్ష), సావాసం (ఏకరి సత్యనారాయణ), డార్క్ స్టోరీస్ (కృష్ణ కార్తీక్), మనల్ని ఎవడ్రా ఆపేది (బీశ్రీ నివాసరావు), ది ఫైనల్ కాల్ (ప్రణయ్ రాజ్ వంగరి), అవతారం (డాక్టర్ సతీశ్) ఉన్నాయి. ఈ చిత్రాలను 2026 ఆగస్టు 15కు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.