12-11-2025 06:06:47 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగాళపేట్ శివారులో ఉన్న గుట్టపై బుధవారం సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన వంశీధర్(34) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఇంటి నుండి కూలి పనులకు వెళ్లిన ఆయన ఇంటికి రాకపోవడంతో పోలీసులకు మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు రాగా, పశువుల కాపరులకు మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.