calender_icon.png 12 November, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు, పెన్షనర్లకు తీవ్ర నష్టం

12-11-2025 06:02:17 PM

టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి..

నకిరేకల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లకు తీవ్రనష్టం జరుగుతుందని తాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి పేర్కొన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో తాప్రా నకిరేకల్ డివిజన్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించే రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ ను నిరంకుశంగా తొలగించే ప్రయత్నం చేయడంతో పాటు 2025 ఆర్థిక బిల్లు పేరుతో పెన్షనర్స్ రూల్స్ ధ్రువీకరణ కొత్త ఫైనాన్స్ చట్టం ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులపై దాడి చేయడమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు డిఏలు పిఆర్సి ప్రకటించాల్సి ఉన్నా కూడా ఖజానా లోటు పేరుతో దాటవేత ధోరణి అవలంబిస్తుందన్నారు.

అన్ని సంఘాలు ఐక్యతతో పోరాడితే మన హక్కులను సాధించుకోగలుగుతామని పేర్కొన్నారు. 2024 మార్చిలో రిటైర్డ్ అయిన  ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో డివిజన్ అధ్యక్షుడు చాపల అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ చంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు యానాల కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, జిల్లా గౌరవాధ్యక్షులు కుకుడాల గోవర్ధన్, జిల్లా కోశాధికారి అబ్దుల్ ఖాదర్, డివిజన్ నాయకులు  పట్టేటి కృష్ణయ్య, బిచినేపల్లి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.