5 August, 2026 | 12:38 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

27-05-2024 12:48 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ వద్ద కిన్నెరసాని వాగు వంతెనపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నా యి.. చర్ల మండలం గుడిపాడుకు చెందిన నర్సింహారావు (18), దూసనపల్లికి చెందిన హర్షవర్ధన్ బైక్‌పై పాల్వంచ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కారు వంతెనపైకి రాగానే రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందగా, హర్షవర్ధన్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. కాగా, ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని బూర్గంపాడు పోలీసులు తెలిపారు.