విద్యార్థులకు న్యాయం చేయాలి
27-05-2024 12:47 AM
మూల్యాంకనంలో ఇంటర్‌బోర్డ్ నిర్లక్ష్యం
ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): మూల్యాంకనంలో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణం గా పలువురు విద్యార్థులకు మార్కు లు తక్కువగా వచ్చాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరాజు ఆరోపించారు. ఓ విద్యార్థికి లాంగ్వేజీ సబ్జెక్టులో మొదట 21 మార్కులు వచ్చి ఫెయిల్ అయితే, రీవెరిఫికేషన్‌కు అతను దరఖాస్తు చేసుకోగా 91 మార్కులొచ్చాయని తెలిపారు. మరో కామర్స్ విద్యార్థికి 97 మార్కులొస్తే 77 మార్కులు వేశారన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇంటర్ బోర్డు గతంలోనూ అనేక తప్పిదాలు చేసిందని గుర్తుచేశారు. పేపర్ మూల్యాంకనంలో మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు మార్కులు కలిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






