calender_icon.png 2 December, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి

02-12-2025 10:19:45 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం సమీపంలోని రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మహేందర్ నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి పని నిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో లొంకలపల్లి గ్రామ శివారు పరిధిలో నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన పోచయ్య పంట పొలాల నుండి రోడ్డుపైకి బైక్ పై ఎక్కుతుండగా మహేందర్ పోచయ్య రెండు బైకులు ఒక్కసారిగా  ఢీకొన్నాయి. దీనితో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మహేందర్ మృతి చెందాడు. పోచయ్య పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.