calender_icon.png 17 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ శకం ముగిసింది

03-12-2025 12:00:00 AM

  1. వారం పది రోజుల్లో నామినేటెడ్ పోస్టులు
  2. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, డిసెంబర్ 2( విజయక్రాంతి): ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల ను వారం, పది రోజుల్లో భర్తీ చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలు పర్యటి స్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ శకం ఇక ముగిసిందని, ఆయ న ఇంట్లోనే ఆస్తుల పంచాయతీ మొదలైందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం మహి ళలు, పేదల పక్షపాతంగా పని చేస్తుందన్నా రు. రాహుల్‌గాంధీ ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో  కుల సర్వే నిర్వహించామని, అందుకే మోదీ ఇప్పుడు జన గణనలో కుల సర్వే చేస్తామని ప్రకటించారని చెప్పారు.

పీసీసీగా ఇచ్చిన బాధ్యతను తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని, ఏళ్ల తరబడి పార్టీలో కష్టపడితేనే పదవులు వస్తాయ న్నారు. పనికి తగిన గుర్తింపు ఉంటుందని, స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ డీసీసీ అధ్యక్షులు పార్టీ నిర్మాణంపై దృష్టి పె ట్టాలన్నారు. ఓటు చోరీ కార్యక్రమంపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.