డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి నెలరోజుల జైలుశిక్ష
సుల్తానాబాద్ ఎస్‌ఐ చంద్రకుమార్
సుల్తానాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం మార్కండేయ కాలనీకి చెందిన సల్ల కుమార్ అనే వ్యక్తి తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటంతో సుల్తానాబాద్ ఎస్త్స్ర చంద్రకుమార్ అట్టి వ్యక్తిని గుర్తించి గురువారం కోర్టు లో హాజరుపరచగా మెజిస్ట్రేట్ దుర్గం గణేష్ నిందితునికి నెల రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు,
ఈ సందర్భంగా సీఐ రంజిత్ రావు మాట్లాడుతూ ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం జరగడంతో పాటు, బాధితుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కావున ఎవరు కూడా తాగి వాహనాలు నడపవద్దు అని అలా నడిపినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్ష పడటంలో ప్రముఖ పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు రేణుక, దేవరాజులను సిఐ రంజిత్ రావు అభినందించారు.






