10-05-2025 12:02:44 AM
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్
మహబూబ్‌నగర్ మే 9 (విజయ క్రాంతి) విద్యార్థులుమూఢనమ్మకాలకు దూ రంగా ఉండాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్ తెలిపారు. దివిటీ పల్లి డబుల్ బెడ్ రూమ్‌లో పి బాలకృష్ణ గౌ డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపుకు హాజరై శుక్రవారం మ్యాజిక్ షో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి సైన్సు ను శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మాలని మారుతున్న టెక్నాలజీ అనుకూలంగా విద్యార్థులు కూడా మెలగాలని తెలిపారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఫోన్,టీవీలను మంచికి మాత్రమే ఉపయోగించాలని అన్నారు. పేద విద్యార్థుల కోసం బాలకృష్ణయ్య గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ని ర్వాహకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్ టీఎస్ యుటిఎఫ్ మహబూబ్ నగర్ అర్బన్ మండల ఉపాధ్యక్షులు కథలయ్య, సహాయ కార్యదర్శి హేమంత్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.