10-05-2025 12:01:27 AM
- మణికొండలో పేదల పట్టా భూములు కాజేస్తున్న అక్రమార్కులు
-చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
మణికొండ, మే 9: రాజకీయ నాయకుల స్వార్థానికి అంతే లేకుండా పోతోంది. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా కబ్జాలు చేస్తూ కాజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మణికొండలో పేద ప్రజల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో సర్వే నెంబర్ 261లో 278 పట్టాలు మంజూరు చేసింది.
ఈ భూములపై కన్నేసిన స్థానిక నాయకులు.. 278 పట్టా భూములతో పాటు మరికొన్ని స్థలాలకు నకిలీ పట్టాలు సృష్టించారు. ఇలా దాదాపు 300 పట్టా స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్నారు. బుల్కాపూర్ కబ్జా చేసి శ్మశానాలను సైతం ఆక్ర మించి అక్కడ ఉన్న ఖాళీ స్థలాలకు దొంగ పట్టాల సృష్టించి అమ్మకాలు జరిపారు.
ఈ కబ్జా భాగోతం తాజాగా బయటకు వచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం, రెవన్యూ అధికారులు ఇప్పటికైనా ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని, పేదల పట్టా భూములను, శ్మశాన భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణ దారులపై గట్టి చర్యలు తీసుకోకుంటే ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
ఆక్రమణలు గుర్తించి తొలగిస్తాం
మణికొండ పరిధిలో పేదలకు పంచిన భూము లు ఆక్రమించుకు న్న వారిపై చర్య లు తీసుకుంటాం. ఇప్పటికే ఈ విషయంపైన మా అధికారుల బృందం వివరాలు సేకరిస్తున్నది. ఆక్రమణ దారులు ఎంతటి వారైనా వదిలేది లేదు.
శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్, గండిపేట