calender_icon.png 11 May, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీపుల్స్ హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసులు

10-05-2025 12:03:21 AM

- మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి

- డిఎంహెచ్‌ఓ

 యాచారం, మే 9 :సరైన వైద్య సిబ్బంది, అర్హతలేని వ్యక్తులతో వైద్య సేవలు కొనసాగిస్తున్నారన్న బాధితుల ఫిర్యాదు మేరకు మాల్ పీపుల్ హాస్పిటల్ కు వైద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో యాచారం మండల పరిధిలోని మాల్, పీపుల్స్ హాస్పిటల్ కు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి (డిఎంహెచ్‌ఓ) శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

గత నెల 20వ తేదీన తక్కెళ్ళపల్లి గ్రామానికి చెందిన పి.బాబు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం హాస్పిటల్ కి  రావడంతో అతనికి డాక్టర్లు సరైన వైద్యం చేయకుండానే, అధిక డబ్బులు వసూలు చేశారని, అదేవిధంగా కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారని వాపోయారు.

ఇదే విషయమై అతని కుమారుడు శ్రీశైలం, జిల్లా డిఎంహెచ్‌ఓ కు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఫిర్యాదు చేశారు. మూడు రోజులలో హాస్పిటల్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదికను జిల్లా వైద్య కార్యాలయానికి సమర్పించాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఓ ఇబ్రహీంపట్నం అధికారి వినోద్ ను ఆదేశించారు.