రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెరిగిన రద్దీ
15-05-2026 12:27 AM
కూకట్‌పల్లి, మే 14(విజయక్రాంతి): ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతుందన్న ముందస్తు సమాచారంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో రిజిస్టార్ కార్యాలయం లో రద్దీ పెరిగింది. భూముల విలువ పెరగడం ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెర గకముందు, మంచిరోజుల్లో రిజిస్ట్రేషన్లకై రియల్ వ్యాపారులు, ప్రజలు ఆసక్తి చూపా రు.
బుధ, గురువారాల్లో కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని రిజిస్టర్ కార్యాలయంలో రద్దీ పెరిగి రిజిస్ట్రేషన్ కోసం క్యూలో వేచి ఉన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేక రిజిస్టర్ కార్యాలయాలు వెలవెల బోయాయి. రెండు రోజుల నుంచి కార్యాలయాల్లో సందడి నెలకొంది. రిజిస్ట్రేషన్లు పెరగడంతో డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయ సిబ్బంది సంతోషం వ్యక్తంచేశారు.






