25 March, 2026 | 1:07 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

పద్దెనిమిది ఏండ్లు నిండితేనే పెండ్లి చేయాలి

22-01-2026 12:48 AM

మోతె, జనవరి 21: మైనర్ పిల్లలకు పెళ్లిళ్లు చేయవద్దని, 18 సంవత్సరాలు నిండిన తరువాతే పెళ్లిళ్లు చేయాలని సర్పంచ్ వాసంశెట్టి అరుణ కిషన్ రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, తుమ్మల పల్లి, గ్రామాలలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వయస్సు రాక ముందే పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని కుటుంబాలలో అనేక సమస్యలు వస్తాయని తెలిపారు.

చాటు మాటుగా పెళ్లిళ్లు చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళగూడెం గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి, గ్రామ కార్యదర్శి లు సతీష్ రెడ్డి, సంతోష్, జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి స్వచ్ఛంద కార్యకర్తలు గుద్దేటి వెంకన్న, పల్లెల లక్ష్మణ్, యస్ కృష్ణ వేణి, ఉపసర్పంచులు వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, అంగన్వాడీ టీచర్ ఉమ, ఆశ కార్యకర్త సుభద్ర తదితరులు పాల్గొన్నారు.