గ్రామాభివృద్ధికి స్వచ్ఛందగా కృషి చేయాలి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
మొయినాబాద్ ఏప్రిల్ 26(విజయ క్రాంతి): గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేయాలని, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. ఆదివారం మొయినాబాద్ మండల పరిధిలోని అమ్దపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మద్యపాగ కృష్ణ, ఉపసర్పంచ్ జితేందర్ రెడ్డి, మన్నె ప్రభాకర్ రెడ్డిల కృషితో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని ప్రజలకు ఉచితంగా అందిస్తున్న వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఆరో గ్యంగా ఉండేందుకు శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకున్న ప్పు డే అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీఠ వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, నాయకులు మన్నె ప్రభాకర్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, పట్నం రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






