27 April, 2026 | 1:49 AM

నిమిషాంబదేవిగా భక్తులకు దర్శనం

27-04-2026 12:00 AM

మేడిపల్లి ఏప్రిల్ 26(విజయక్రాంతి): అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి స్వరూపిణి, కోరికలను తీర్చే జగజ్జనని శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారి ఆవిర్భావ మహోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఆదివారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని నిమిషాంబ దేవాలయంలో అమ్మవా రిని  విశేష అలంకరణలో అమ్మవారు దివ్య కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ సర్వ మంగళ స్వరూపిణిగా సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్  కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు  కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు, ట్రస్ట్ ధర్మకర్తలు  బి. హిమచందర్, డి. నర్సింగ్ రావు,  ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా, డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, వై. చంద్రశేఖర్, ఎన్. మోహన్, ఎస్. గౌరి శంకర్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్,ఎన్ . రామకృష్ణ, వై. సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు ఉమకాంత్ శర్మ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.