రాష్ట్రమంతటా ఒకే ఓటు.. కంటోన్మెంట్‌లో రెండు
అటు లోక్‌సభ.. ఇటు అసెంబ్లీ ఎన్నిక
ఉప ఎన్నిక నేపథ్యంలో రెండు ఓట్లు వేయనున్న ఓటర్లు
హైదరాబాద్, మే 12(విజయక్రాంతి): తెలంగాణలో లోక్‌సభ ఎన్నిలకు సర్వం సిద్ధమైంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్ల మెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండటంతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకూ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రమంతటా ఒకే ఓటు వేస్తే.. కంటోన్మెంట్ ఓటర్లు మాత్రం రెండు ఓట్లు వేయనున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.
బీఆర్‌ఎస్ తరుపున నందిత సోదరి నివేదిత బరిలో నిలవగా, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్ నారాయణన్ పోటీలో ఉన్నారు. గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు మాత్రమే ప్రతీ ఓటరు రెండేసి ఓట్లు వేసేవారు. ఈసారి వేర్వేరుగా జరుగుతున్నప్పటికీ, ఉపఎన్నిక రావడంతో కంటోన్మెంట్ ఓటర్లు ఒకటి అసెంబ్లీకి, మరో ఓటు లోక్‌సభ అభ్యర్థికి వేయనున్నారు.




