12 April, 2026 | 2:08 PM

బిలియనీర్ల రాజ్యం!

13-05-2024 01:07 AM

రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు

కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతున్న సంపద

వందేళ్లలో మరింతగా పెరిగిన ఆర్థిక అసమానతలు

ఒక్క శాతం ధనవంతుల్లోనే 40.2 శాతం సంపద

ప్రపంచ దేశాల్లోకెల్లా భారత్‌లోనే అత్యధికం 

ఇన్‌కమ్ అండ్ వెల్త్ ఇన్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా పేరిట నివేదిక 

వందేళ్లలో ఆర్థిక స్థితిగతులపై వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ విశ్లేషణ

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): బ్రిటీష్ కాలంలో సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆర్థిక అసమానతలతో కొందరు ధనవంతుల చేతుల్లోనే సంపద మొత్తం చేరిపోయేది. అంటే ఆర్థిక అసమానతలు చాలా దారుణంగా ఉండేవి. అఇయతే అప్పటితో పోలిస్తే ఇప్పుడే ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికన్నా అప్పుడే నయం అనిపించేలా ఉన్నాయట ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు.. 

వందేళ్లలో భారీగా అసమానతలు.. 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు ఏటికేటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఇది మరింత తీవ్రంగా ఉంది. గత వందేళ్లుగా చూసుకుంటే బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2020లో వచ్చిన కోవిడ్ తర్వాత అది మరింతగా పెరిగింది. కొద్ది మంది చేతుల్లోనే సంపద మొత్తం కేంద్రీకృతం అవుతోంది. ఈ ఆందోళన కలిగించే అంశాలు పారిస్‌కు చెందిన వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ జరిపిన విశ్లేషణలో తేలింది. 1922 నుంచి 2022 వరకు భారతదేశంలో ఆదాయం, సంపద సృష్టి, ఆర్థిక అసమానతలపై ఇన్‌కమ్ అండ్ వెల్త్ ఇన్‌ఈక్వాలిటీ ఇన్ ఇండియా అనే పేరుతో వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ విశ్లేషణాత్మక నివేదిక విడుదల చేసింది. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల కన్నా భారతదేశంలోనే ఎక్కువ ఆర్థిక అసమానతలు ఉన్నాయట. అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ బిలియనీర్లు ఉన్నారన్న మాట. 

అప్పటి నుంచే.. 

భారతదేశంలో ఆర్థిక అసమానతలు 1980ల నుంచే మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇక 2014 నుంచి 2022 వరకు చూసుకుంటే ఆ ట్రెండ్ తారాస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో సంపద చాలా కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1980ల వరకు ఆర్థిక అసమానతలు కాస్త తగ్గాయని నివేదిక చెబుతోంది. అయితే ఆ తర్వాతి నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు అసమానతలు పెరుగుతూ వచ్చాయి.

పరిష్కారం లేదా..? 

ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్న ట్టే ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కూడా అనేక పరిష్కారాలు ఉన్నాయి. కానీ ఇందుకు రాజకీయపరమైన నిబద్ధత ఎంతో అవసరం. ఆదాయం, సంపద విషయంలో పన్ను విధానాల్లో సమూలమైన మా ర్పులు తీసుకురావాలి. అంతేకాదు ఆరోగ్యం, విద్య, పోషణ వంటి రం గాల్లో  పెట్టుబడులు చాలా జరగాలి. అప్పుడే ప్రస్తుత టెక్నాలజీ యుగం లో సగటు భారతీయులు లబ్ధి పొం దుతారు. ఇక 2022 నాటికి ఉన్న 167 మంది అత్యంత ధనవంతుల నెట్ సంపదపై 2 శాతం సూ పర్ ట్యాక్స్ కనుక విధిస్తే దేశ ఆదాయంలో ఏకంగా 0.5 శాతం ఆదా యం వచ్చే అవకాశం ఉంటుంది.