28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

ఓపెన్ స్కూల్ సద్వినియోగం తీసుకోవాలి

29-06-2025 01:06 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): అనివార్య కారణాలవల్ల విద్యను మధ్యలో మానివేసిన వారికి ఓపెన్ స్కూల్ ఎంతో ఉపయోగపడుతుందని అడల్ట్ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్ రాష్ట్ర సంచాలకుడు శివ కృష్ణ అన్నారు.శనివారం జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఏపీ డి రామకృష్ణ, ఇన్చార్జ్ డిఈవో ఉదయ్ బాబు, రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ కు సంబంధించి సర్వే లో జిల్లా లో అడ్మిషన్ లు మందకోడిగా ఉన్నట్లు తెలిందన్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 902 అడ్మిషన్ల టార్గెట్ ఉందని 100% ఈనెల చివరిలోగా పూర్తి చేయాలని తెలిపారు. పదవతరగతి ఉత్తీర్ణులైన విఏవో లను ఓపెన్ ఇంటర్మీడియట్ లో దరఖాస్తులు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 500 రూపాయలు పదవ తరగతి పరీక్షకు ఫీజు కేటాయించగా ఇంటర్ కు 1000 రూపాయల ఫీజును నిర్ణయించినట్లు తెలిపారు.  జులై 11 తేదీ వరకు ఎలాంటి పెనాల్టీ లేకుండా అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.