సీపీఎం కార్యాలయం ప్రారంభం
20-05-2024 02:23 AM
ఖమ్మం, మే 19 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ ప్రాంతంలో నిర్మించిన సీపీఎం కమిటీ కార్యాలయాన్ని ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి కేరళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేకే శైలజ టీచర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోతినేని సుదర్శన్, బి.వెంకట్, నున్నా నాగేశ్వర్‌రావు, కల్యాణ వెంకటేశ్వర్లు, వై.విక్రమ్, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బుగ్గవీటి సరళ, డి.తిరుపతిరావు పాల్గొన్నారు.






