పెద్దమ్మతల్లి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
20-05-2024 02:22 AM
జయశంకర్ భూపాలపల్లి, మే 19 (విజయక్రాంతి): గణపురం మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.






