2 July, 2026 | 3:00 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ క్లబ్ నిర్వహణ

27-03-2025 12:00 AM

చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్

ఖమ్మం; మార్చి 26: నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ నిర్వహణ కొనసాగుతోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు వినతిపత్రం సమర్పించింది. ఐడీవోసీలో కలెక్టర్ ను బుధవారం కలిసి టీడబ్ల్యూజేఎఫ్ నేతలు వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ క్లబ్ ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఎలాంటి లెక్కాపత్రం లేకుండా... ఆడిటింగ్ లు జరపకుండా దీనిని అడ్డగోలు వేదికగా మార్చారని ఫిర్యాదు చేశారు.  క్లబ్ లో జవాబుదారీతనం లోపించిందన్నారు.  ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ రుసుం వసూళ్లలో అనేక లోటుపాట్లు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ఇచ్చి ప్రభుత్వ అధికారి ద్వారా ఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

అప్పటి వరకూ అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేసి ఇకనైనా ప్రెస్ క్లబ్ నిర్వహణ సవ్యంగా సాగేలా చూడాలని కోరారు. ప్రెస్ క్లబ్ ఆడిటింగ్ లోపాల పైనా ప్రభుత్వ అధికారి ద్వారా విచారణ చేయించాలని విన్నవించడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో  టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవరావు, మానుకొండ రవికిరణ్, షేక్ జానీపాష, సుభాని, మేగా దేవేందర్, అర్షద్, యాకుబ్ పాష తదితరులు పాల్గొన్నారు.