22-05-2025 01:38:55 AM
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): మావోయిస్టులపై సాగుతున్న పోరులో కేంద్రం కీలకమైన విజయాన్ని సాధించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా శక్తివంతమైన నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్‌లోని ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతమైందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్‌లో అత్యంత కీలకమైన నేత, సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు సహా మొత్తం 27 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలిపారు. గత మూడున్నర దశాబ్దాలలో ప్రధాన కార్యదర్శి స్థాయిలో మావోయిస్టు నాయకుడి హతం తొలిసారన్నారు.
54 మంది అరెస్టు, 84 మంది లొంగుబాటు భద్రతా దళాలు ఘన విజయానికి గుర్తుగా పేర్కొన్నారు. నక్సలిజం మూలాలను పూర్తి గా తొలగించేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలకమైన ఘట్టంగా అభివర్ణించారు.