calender_icon.png 22 May, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

22-05-2025 01:37:03 AM

  1. వారి అభివృద్ధికి రూ.3,591 కోట్లు కేటాయింపు
  2. అందులో రాజీవ్ వికాసానికి రూ.841 కోట్లు
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సెక్యులిరిజాన్ని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి మక్కాయాత్రకు బయలుదేరిన యాత్రికుల వాహనాలను ఆయన జెండాఊపి ప్రారంభించారు.

పవిత్రమైన మక్కా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.

మైనార్టీల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం రూ.3,591 కోట్లు కేటాయించిందని, ఇందులో రాజీవ్ వికాసం ద్వారా ముస్లిం యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను రూ.841 కోట్లు కేటాయించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణా హౌజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలతో పాటు పలువురు ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.