22-05-2025 11:17:07 AM
నిజాంసాగర్, (విజయక్రాంతి): పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం గురువారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు(Jukkal MLA Thota Lakshmi Kanta Rao) భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇండ్లునిర్మించి ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందని,జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తన ధ్యేయమని అయన తెలిపారు.పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తానన్నారు.కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వాకెట్ రాంరెడ్డి, బొడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.