18 April, 2026 | 9:35 PM

Breaking News

ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి

01-04-2025 01:34 AM

సూర్యాపేట,మార్చి31(విజయక్రాంతి): చత్తీస్ గడ్లో చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ 8న సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో  హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ప్రజా ధర్నాలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమ వాల్ పోస్టర్స్ ను సూర్యాపేట జిల్లా కేంద్రం లోని కామ్రేడ్ చండ్ర పుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రం లో ఆవిష్కరణ చేసి  న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్  ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసి జాతి హననానికి బిజెపికి చెందిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండ కు తెగబడుతున్నాయని అన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.