11 August, 2026 | 2:06 AM

మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి

11-08-2026 12:00 AM

కూసుమంచిలో రాస్తారోకో

కూసుమంచి, విజయక్రాంతి): కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సన్మాతరావు పిలుపునిచ్చాడు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జై భరో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పద్మారెడ్డి భువన నుండి నేలకొండపల్లి రోడ్డు నుండి ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.

వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తోటకూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సన్మంతరావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు, వాటి నిబంధనలను పూర్తిగా రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2025ను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ రంగం ప్రైవేటుకరణ నిలిపియాలని, కనీస వేతనం రూ .42,000 లను, డిఎతో అనుబంధం చేసి అన్ని రకాల కార్మికులకు, అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం   ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిత్తూరు వెంకన్న తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, చేగొమ్మ సొసైటీ చైర్మన్ బడేటి శీను, సిఐటియు మండల అధ్యక్షుడు భూక్య హుస్సేన్, పందిరి శ్రీను, టీఎంకెఎంకెఎస్ జిల్లా కార్యదర్శి సింగం కృష్ణంరాజు, సింగం సోమయ్య, ప్రజా సంఘాల నాయకులు శీలం గురుమూర్తి, చీర్ల రాధాకృష్ణ, కర్ణబాబు, జవ్వాజి శీను, కందుల బాబు, ఎర్రబోయిన సురేష్ నిమ్మల ఉపేందర్, మామిడాల ఉపేందర్ , ఎస్.కె బాబు, కంచర్ల జగన్మోహన్ రెడ్డి, వెన్ను ఉపేందర్, రూప్లా నాయక్, బాసు నాయక్, ఆరుట్ల శ్రీను వీరబాబు బెల్లం నాగేశ్వరరావు ప్రతాప్, ప్రసాద్, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు