29 March, 2026 | 2:26 AM

ఆటే టాలీవుడ్ పొగరు !

29-03-2026 12:36 AM

క్రీడల నేపథ్యంలో వచ్చిన సినిమాలు వినోదం పంచడమే కాక వ్యక్తిగత పోరాటాలు, భావోద్వేగాలనూ ప్రతిబింబింపజేస్తూ స్ఫూర్తి నింపుతాయి. తెలుగు చిత్రసీమ చరిత్రలో అలాంటి చిత్రరాజాలెన్నో ప్రేక్షకుల జేజేలందుకున్నాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో మరింత అద్భుతమైన అనుభూతి పంచేందుకు ఇప్పుడు రామ్‌చరణ్ ‘పెద్ది’, శర్వానంద్ ‘బైకర్’, వరుణ్ తేజ్ ‘బరి’ వంటి సినిమాలు ప్రస్తుత పాన్ ఇండియా వేదికపై టాలీవుడ్ పొగరును చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాక్సర్‌గా, పోలీస్ అధికారిగా నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ కూడా విడుదల కావాల్సి ఉంది. మరి తెలుగులో ఇప్పటికే ప్రేక్షకుల మది దోచుకున్న ఆ చిత్రరత్నాలేంటి? రాబోయే సినిమాల విశేషాలేంటి? చదివేయండి..  

క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలివే.. 

క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ‘జెర్సీ’ గొప్ప భావోద్వేగపూరిత చి త్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడాలనుకునే ఒక వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా. ఒక వయసు మళ్లిన క్రికెటర్ (నాని), తన కొడు కు కోరిక తీర్చడానికి, తనను తాను నిరూపించుకోవడానికి 36 ఏళ్ల వయసులో తిరిగి బ్యాట్ పట్టే కథ ఇది. 2019లో విడుదలైన ఈ సినిమా హీరోగా నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇదే క్రికెట్ ఆట నేపథ్యంలో 2011లో వచ్చింది ‘గోల్కొండ హైస్కూల్’. ఇందులో సుమంత్ హీరోగా నటించారు. ఒక స్కూల్ ప్లేగ్రౌండ్‌ను కాపాడుకోవడానికి మాజీ క్రికెటర్ కోచ్‌గా మారి, క్రమశిక్షణ లేని విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దే స్ఫూర్తిదాయక చిత్రం నాగచైతన్య హీరోగా నటిం చిన ‘మజిలీ’ (2019) ప్రేమలో విఫలమై క్రికెట్ కెరీర్‌ను కోల్పోయిన యువకుడి కథ ఇది. తన భార్య మద్దతుతో ఆ యువకుడు మళ్లీ కోచ్‌గా తన జీవితాన్ని ఎలా గాడిలో పెట్టుకున్నాడనేది ఇందులో చూపించారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘వసంతం’ (2003) స్నేహం, క్రికెట్ లక్ష్యం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కించారు.

చదువు కంటే క్రికెట్‌పై మక్కువ చూపే కొడుకు, అతని తండ్రి మధ్య జరిగే భావోద్వేగపూరిత సంఘర్షణల సమాహారమే ‘ధోని’ (2012) చిత్రం. ఒక పేద రైతు బిడ్డ, తన తండ్రి ము ఖంలో చిరునవ్వు చూడటం కోసం కష్టపడి భారత మహిళా క్రికెట్ జట్టులోకి ఎలా చేరిందో చూపించిన చిత్రం కౌస ల్య కృష్ణమూర్తి (2019 ). ఇంకా ‘సూపర్ ఓ వర్’, ‘భజే వాయు వేగం’ వంటి సినిమా లు క్రికెట్, బెట్టింగ్ మాఫియా నేపథ్యం లో వచ్చి, సందేశమిచ్చాయి. 

బాక్సింగ్ రింగ్‌లో జరిగే పోరాటాలతోపాటు పౌరుషం, పంతం వంటి అంశాలతో రూ పొందే సినిమాలు కూడా తెలు గు ప్రేక్షకులకు మంచి అనుభూ తి పంచాయి.  వీటిల్లో ప్ర ధానంగా చెప్పుకోదగ్గ చిత్రం పవ న్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’. బాధ్యతలేని ఓ తమ్ముడు, తన అన్నను గాయపరిచిన ప్రత్యర్థిపై బాక్సింగ్ రింగ్‌లో ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా ప్ర ధాన కథ.

1999 లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షక లోకం జేజేలందుకోవడమే కాక పవన్‌కల్యాణ్ కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచింది. పవన్‌కల్యాణ్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాని’ (2003). మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ శైలి పోరాటాలతో సాగే కథ ఇది. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘ఒక్కడు’ (2003) సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. ఒక ఆటగాడు తన ఆటతోపాటు ఒక అమ్మాయిని కాపాడే కథ ఇది.

రవితేజ రవితేజ కిక్ బాక్సర్‌గా నటించిన చిత్రం ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (2003). బాక్సింగ్ చుట్టూ తిరిగే కుటుంబ కథ ఇది. 2022లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. విక్టరీ వెంకటేశ్ నటించిన ‘గురు’ (2017) సినిమా బాక్సింగ్ కోచ్, శిష్యురాలి మధ్య సాగే కథ. ఒక కఠినమైన శిక్షకుడు.. ప్రతిభ ఉన్న మురికివాడ అమ్మాయిని బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎలా మా ర్చాడనేదే ఈ సినిమా ఇతివృత్తం. బాక్సింగ్ లక్ష్యంగా సాగే మరో స్పోర్ట్స్ డ్రామా ‘గని’. వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2022లో వచ్చింది.  

మరికొన్ని ఆటలతోనూ సినిమాలు.. 

తెలుగులో వివిధ ఆటల చుట్టూ అల్లుకున్న కథలు కూడా ప్రేక్షకుల మెప్పు పొందాయి. 2001లో వచ్చిన ‘భద్రాచలం’ సినిమా ఓ గ్రామీణ యువకుడు తన ప్రతిభతో తైక్వాండోలో ఎలా రాణించాడనే కథతో వచ్చింది. ఇందులో దివంగత నటుడు శ్రీహ రి హీరోగా నటించారు. ఈ సినిమాలోని ‘గెలుపు పొందే వరకూ.. ఎదురులేదు మన కు..’ అనే గీతం ఇప్పటికీ వినవస్తూ ఉంటుంది.

నితిన్‌ను కథానాయకుడుగా దర్శకుడు రాజమౌళి రూపొందిం చిన ‘సై’ (2004) చిత్రం తెలుగు ప్రేక్షకులకు రగ్బీ క్రీడను పరిచయం చేసింది. కాలేజ్ గ్రూపుల మధ్య జరిగే పోటీని ఈ సినిమాలో రగ్బీ ఆట ద్వారా చూపించారు. 2021లో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ సినిమా విలువిద్య (ఆర్చరీ) నేపథ్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇదే ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రం హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందింది.

‘భీమిలి కబడ్డీ జట్టు’ కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కించారు. షూటింగ్ గేమ్ నేపథ్యంలో ‘గుడ్ లక్ సఖి’ సినిమా రూపుదిద్దుకుంది. అథ్లెటిక్స్ ప్రధానంగా ‘క్లాప్’, ఫుట్‌బాల్ ఆట నేపథ్యం కథతో ‘విజిల్’ సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ గేమ్ నేపథ్యంలో ‘గుడ్ లక్ సఖి’ సినిమా రూపుదిద్దుకుంది. అథ్లెటిక్స్ ప్రధానంగా ‘క్లాప్’, ఫుట్‌బాల్ ఆట నేపథ్యం కథతో ‘విజిల్’ సినిమాను తెరకెక్కించారు. 

ఇండియాలో తొలి పూర్తిస్థాయి రేసింగ్ డ్రామా బైకర్ 

స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న తొలి స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామా ఇది. ఈ సినిమాలో మోటోక్రాస్ రేసింగ్ ప్రపంచాన్ని నిజంగా చూపించేందుకు హీరో శర్వా పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేట్ అయ్యారు. ఈ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా టాలీవుడ్‌లో చరిత్రలో ప్రత్యేకంగా నిలువనుంది. 

వాలీబాల్ ఆటతో బరిలోకి వరుణ్‌తేజ్ 

వరుణ్‌తేజ్ హీరో గా పింక్ ఎలిఫెంట్ పిక్చ ర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మాతగా దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో లాం ఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభో త్సవానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌క ళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముహూ ర్తపు సన్నివేశానికి పవన్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్‌రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. “నా ‘ముకుంద’ తర్వాత మళ్లీ మా బాబాయ్ చేతుల మీదుగా మళ్లీ ‘బరి’ చిత్ర ప్రారంభోత్సవం జరగటం ఆనందంగా ఉంది. నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్త య్యాయి. నేను కూడా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నా.

వచ్చే సం క్రాంతికి ‘బరి’ సినిమాను బరిలోకి దించబోతున్నాం” అని చెప్పా రు. ‘మా నాన్న వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలుస్తుంది. చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉంది. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈసారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతున్నారు” అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా అన్వర్ అలీ, ఆర్ట్ డైరెక్టర్‌గా విష్ణువర్ధన్ పుల్ల పనిచేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో చిత్ర దర్శకుడు యదు వంశీ, సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు. 

ఆట ఏదైనా సత్తా చాటే పహిల్వాన్ పెద్ది 

రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు అత్యంత ప్రతిష్టాత్మ కంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తుండటం ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా చేసింది. తొలుత ఈ కథ క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగినా తాజాగా విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ వీడియో సినీప్రియులను మరింత ఉత్కంఠకు గురిచేసింది. ఇందులో రామ్‌చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెస్మరైజింగ్‌గా ఉంది.

సిక్స్-ప్యాక్ అబ్స్, దృఢమైన కండరాలు, ఇంటెన్స్ ప్రజెన్స్‌తో నిజమైన పహిల్వాన్‌గా కనిపించారు. మల్లయోధుడిగా చరణ్ బరిలోకి దిగి కుస్తీ పట్టే సన్నివేశాలు రోమాంచింతగా ఉన్నాయి. క్రికెట్‌లో ఆరితేరిన ఓ యువకుడు పరిస్థితుల కారణంగా మల్లయుద్ధం వైపు ప్రయాణం సాగించటమే ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.

ఇంతకు ముందు క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ‘లగాన్’, కుస్తీ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ వంటి బాలీవుడ్ సినిమాలు ఎలాంటి రికార్డులు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ రెండు స్పోర్ట్స్ ఎమోషన్లను ఒకే కథలో మేళవిస్తూ బుచ్చిబాబు వేసిన ప్లాన్ చూసి, బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్ పక్కా అనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.