31 August, 2026 | 2:05 AM

సూర్య సరసన?

31-08-2026 12:00 AM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ చిత్రంలో తొలిసారి హీరోగా నటించి ఇటీవలే సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇదే సినిమాలో బాలీవుడ్ భామ వామికా గబ్బి నటనకూ ప్రశంసలు దక్కాయి. ఫలితంగా ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయి, ఫుల్ జోష్‌లో ఉందీ బ్యూటీ. తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఖాతాలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి.

ఇప్పటికే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’లో రిషబ్ శెట్టి సరసన వామికా నటించనుందనే వార్తలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతుండగా, తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఈ భామ సొంతమైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 49వ చిత్రంలో వామికా గబ్బి కథానాయికగా ఎంపికైందనేదే ఆ వార్తల సారాంశం. సూర్య పక్కన మెరిసే ఛాన్స్ దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడి పేరు చర్చనీయాంశంగా మారింది.

విలక్షణ దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్టులో టాలీవుడ్ సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారని టాక్. ప్రస్తుతం సూర్య తన ముందస్తు ప్రాజెక్టుల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా వచ్చే ఏడాదిలో ఈ తాజా ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.