31 August, 2026 | 3:31 AM

హక్కులు అందరికీ సమానంగానే ఉంటాయి

31-08-2026 02:04 AM

నంచర్లలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

మహమ్మదాబాద్, ఆగస్టు 30 : మండల పరిధిలోని నంచర్ల గ్రామ పంచాయతీలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే (Civil Rights Day) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, అంటరానితనం వంటి భావాలకు దూరంగా ఉంటూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించాలని పిలుపునిచ్చారు.

పౌర హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఫాహిద్ పాషా, జీపీవో లలిత, ఉపసర్పంచ్ సుమిత్రా లక్ష్మణ్, వార్డు సభ్యులు చిన్నారెడ్డి, గువ్వ మాధవులు, గ్రామ పెద్దలు గడ్డమీది రాములు, జోగు అంజీలయ్య, లింగాలపల్లి భీమయ్య, జె.వీరేందర్, బ్యాగరి దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.