42 కిలోమీటర్ల పరుగు పందెంలో కామారెడ్డివాసికి మెడల్
కామారెడ్డి, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో NMౄC ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు జరిగిన 42 కిలోమీటర్ల పరుగు పందెం లో గెలిచి కామారెడ్డికి చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ మెడల్ సాధించారు. ( మారథాన్ ) ను నెక్లెస్ రోడ్డు, రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్, హుసేన్ సాగర్ కట్ట, KBR పార్క్, దుర్గం చేరువు, ఓల్ బాంబే రోడ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం లోపలికి వరకు 42 కిలోమీటర్ల దూరన్ని కామారెడ్డి మున్సిపల్ 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ పాల్గొని 42 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 54 నిమిషాల్లో నాన్ స్టాప్ రన్నింగ్ చేసి కంప్లీట్ చేసి 42 కిలోమీటర్ల మారథాన్ పథకాన్ని సాధించారు.
గతంలో కూడ గెరిగంటి లక్ష్మినారాయణ ఎన్ ఎం డి సి మారథాన్ లో పాల్గొనేందుకు గత మూడు నెలలుగా కఠోర శ్రమతో కూడిన పరుగులు చేశాడు. 3 నెలలుగా కామారెడ్డి లోని ఇందిరా స్టేడియం, రాశివణం, డిగ్రీ కళాశాల గ్రౌండ్, సిరిసిల్ల రోడ్డు రాజీవ్ పార్క్ లలో రోజుకు 5 కిలోమీటర్లు, ప్రతి అదివారం కామారెడ్డి రైల్వే కమాన్ నుండి కామారెడ్డి చుట్టూ నలుమూలల వరకు మాచారెడ్డి మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతం, సదాశివనగర్ మండలం దగ్గి, రామారెడ్డి మండలం బుగ్గ రామలింగేశ్వర స్వామి మద్దికుంట
లింగంపేట మండలం మెంగారం, మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం కోమాటి పల్లి, బిబి పేట్ మండలం తుజాల్ పూర్, మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి, వడ్లూరు, ఉప్పల్ వాయి, రామారెడ్డి మీదుగా గర్గుల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వరకు 9 సార్లు 30 కిలోమీటర్లు, గత 10 రోజులుగా రోజు 10 కిలోమీటర్ల చొప్పున పరుగులు కఠోర శ్రమతో సాధనతో మొక్కవోని దీక్షతో 42 కిలోమీటర్ల మారథాన్ పతకాన్ని గెరిగంటి లక్ష్మినారాయణ సాధించారు.
ఇప్పటి వరకు గెరిగంటి లక్ష్మినారాయణ జిల్లా, రాష్ట్ర స్థాయిలో మారదాం రన్నింగ్ పోటీలలో పాల్గొని 10 పతకాలను సాధించారు. గత 7 సంవత్సరాలుగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాదులో జరిగిన 42 కిలోమీటర్ల పరుగు పందెంలో లక్ష్మీనారాయణ మరోసారి పతకాన్ని సాధించారు. తాను పడిన కష్టానికి గుర్తింపు లభించిందని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ తెలిపారు.






