19-12-2025 10:11:55 PM
చిట్యాల,(విజయక్రాంతి): ప్రేమించిన యువతికి దూరంగా ఉంటూ బాధపడుతూ ఎడబాటును తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన సంఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుధీర్ ఓర్వాన్ (22) గత ఏడాది కాలంగా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామపంచాయతీ పరిధిలో గల దశమి కంపెనీలో హెల్పర్ గా పని చేస్తున్నాడు.
తన స్వగ్రామానికి పక్కనే ఉన్న గ్రామ యువతిని ప్రేమించాడు. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి కంపెనీలో పని చేస్తూ ఉండడంతో నిత్యం ప్రేమించిన యువతిని గుర్తు చేసుకుంటూ బాధపడేవాడు. ప్రేమించిన యువతి ని వదిలి దూరంగా పనిచేయడం ఇష్టం లేక తనలో తాను మదనపడుతూ ఎడబాటును తట్టుకోలేక ఈనెల 18న గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన క్వార్టర్స్ కు సమీపంలో గల కాలి స్థలంలో మామిడి చెట్టుకు బ్లాంకెట్తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ వెంకటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.