calender_icon.png 1 October, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్భాటాలు కాదు.. అభివృద్ధిపైనే మా దృష్టి

01-10-2025 12:16:13 AM

ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 30 (విజయక్రాంతి)హంగు, ఆర్భాటాలు సినిమా సెట్టింగ్ల మాదిరి పను లు చేసి పబ్బం గడిపి ఓట్ల రాజకీయాలకు దూ రంగా ఉంటూ కేవలం అభివృద్ధి సంక్షేమంపైనే ప్ర త్యేక దృష్టి సారించినట్లు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవా రం తెలకపల్లి మండలం మదనాపూరం గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రజల బాగు కోసమే ప్రజలు తనకు ఓట్లేసి గెలిపించుకున్నారని వారికి ఇచ్చిన హామీ మేరకు ఆ పనులు చేసుకుంటూ కందనూలు అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు.

కొంతమంది నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ అవాక్కులు చావాక్కులు పేలుతున్నారని అలాంటివారిని పట్టించుకునే అవసరం గత్యంతరం లేదన్నారు. వారితోపాటు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, మాజీ సర్పంచ్ వంశవర్ధన్ రావు, రమణ, నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య తదితరులుపాల్గొన్నారు.