calender_icon.png 1 October, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఆల జన్మదిన వేడుకలు

01-10-2025 12:17:29 AM

అడ్డాకుల, సెప్టెంబర్ 30: మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో మంగళవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ రంగన్న గౌడ్ ఆధ్వ ర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్ రెడ్డిఅన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేశారని కొనియాడారు.

స్థానిక ఎన్నికల్లో గడ్డపై గు లాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశా రు. వారి వెంట సింగల్ విండో చైర్మన్ మద్దూరి జితేందర్ రెడ్డి, ఉద్యమ నాయకులు మద్దూరి చంద్రమోహన్ రెడ్డి, పొనకల్ మహమూద్, మండల మాజీ రైతు బంధు అధ్యక్షులు బి తిరుపతిరెడ్డి, కాజా గోరి, దేవేందర్ రెడ్డి, చంద్రకాంత్, దేవన్న, యువకులతో కలిసి కేక్ కట్ చేశారు. నాయకులు ఒకరికొకరు తినిపించుకున్నారు .