calender_icon.png 1 October, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వు చదువమ్మా...విద్యా నిధి నుంచి రూ 62,500

01-10-2025 12:14:59 AM

చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): నువ్వు చదవమ్మా అంటూ  ఎప్సెట్ లో ర్యాంకు సాధించిన విద్యార్థిని ఎస్.మహాలక్ష్మికి  మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  భరోసాను కల్పించారు.   

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకొన్న మహాలక్ష్మి  గత సంవత్సరం  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పయనీర్ కా ర్యక్రమం ద్వారా ఎప్సెట్ కు కోచింగ్ తీసుకుని 12362 ర్యాంకును సాధించి,  మూడవ ఫేజ్ కౌ న్సిలింగ్ లో  ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు  సీటు పొందింది.

విద్యార్థిని తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో , యూనివర్సిటీ ఫీజు కూడా  కట్టుకోలేని బీద స్థితిలో విద్యార్థిని కుటుంబం ఉందని, ఆ విద్యార్థిని వచ్చి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి త మ సమస్యను చెప్పారు. 

వెంటనే ఎమ్మెల్యే స్పందించిన చదువు మధ్యలో ఆగిపోకూడదు  విద్యార్థిని ని ప్రోత్సహించేందుకు విద్యా నిధి నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ మొదటి సెమిస్టర్ ఫీ జును రూ 62 వేల 500 ల చెక్కును  క్యాంపు కార్యాలయంలో విద్యార్థినికి మంగళవారం అందజేశారు.  ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, బాలుర జూ నియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి తదితరులు ఉన్నారు.